సీఫుడ్ వాల్యు ఎడిషన్‌పై జరిగిన నేషనల్ స్కిల్ ఒలంపియాడ్ రెండవ ఎడిషన్ విజేత - ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి. సూర్య భాస్కర్

Chennai / July 2, 2026

చెన్నైజూలై 2: అగ్ర స్థానం కోసం జరిగిన ఉత్కంఠభరితమైన పోటీలో, ఆంధ్రప్రదేశ్, కాకినాడలోని దేవీ ఫిషరీస్ లిమిటెడ్‌కు చెందిన పి. సూర్య భాస్కర్‌ను, సీఫుడ్ వాల్యు ఎడిషన్‌పై నేషనల్ స్కిల్ ఒలంపియాడ్ సెకండ్ ఎడిషన్ విజేతగా ప్రకటించారు. ఈ ఈవెంట్ గ్రాండ్ ఫినాలే సీఫుడ్ ఎక్స్‌పో భారత్ 2026లో భాగంగా జరిగింది.

మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవెలప్‌మెంట్ అథారిటీ (MPEDA) కార్యక్రమం అయిన ఒలంపియాడ్ చివరి రౌండ్ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా అనుభవం ఉన్న సీఫుడ్ ప్రాసెసింగ్ వృత్తిలో ఉన్న పది మంది సీఫుడ్ వంటడం అలాగే వాటిని ప్రాసెస్ చేయడంలో తమ ప్రతిభను ప్రదర్శించారు. 

తేవా & కో, ట్యూటికోరిన్, తమిళనాడుకు చెందిన ముత్తు కుమారన్ రెండవ స్థానంలో నిలువగా, SS సీఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలకత్తాకు చెందిన శ్రీమతి సాగరికా సర్దర్, భువనేశ్వర్‌కు చెందిన సబ్రీ ఫుడ్ ప్రొడక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బరసరాణి జెనా మూడవ, నాలుగవ స్థానంలో నిలిచారు.

ఆఖరి రౌండ్ విజేతకు 1,00,000 రూపాయలు బహుమతిగా అందిచారు. రెండవ విజేతకు రూ. 75,000 మూడవ విజేతకు రూ. 50,000 అందించారు. నాలుగవ స్థానంలో నిలిచిన విజేతకు కాన్సోలేషన్ బహుమతిగా రూ. 25,000 అందించబడింది.

MPEDA చైర్‌మన్ పి. జవహర్; డైరక్టర్ డా. రామ్ మొహన్ M.K.; సెక్రటరీ డా. గిబిన్ కుమార్; జాయింట్ డైరెక్టర్ శ్రీ అనిల్‌కుమార్; మరియు ముఖ్య అతిథి అలాగే సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEAI) CEO, డా. కె.ఎన్ రాఘవన్, విజేతలకు నగదు బహుమతులు, మెడల్‌లు అలాగే సర్టిఫికేట్‌లను అందించారు.

గ్రాండ్ ఫినాలేలో, ఆఖరి రౌండ్‌కు చేరుకున్న వారికి ఇచ్చిన పోటీ అంతర్జాతీయ మార్కెట్‌లలో డిమాండ్ ఉన్న ఆరు వూల్యూ-యాడెడ్ సీఫుడ్ వంటకాలు సిద్ధం చేయడం – నొబాషీ ష్రింప్, బ్రెడెడ్ బటర్‌ఫ్లై ష్రింప్, వండిన ఒలిచిన డెవినీడ్ టెయిల్ ఆన్ (PDTO) ష్రింప్, మారినేటెడ్ ష్రింప్ స్కీవర్స్, బ్రెడెడ్ స్క్విడ్ రింగ్‌లు మరియు ఫిష్ ఫిల్లెట్స్.

ఈ వంటలు అన్నీ వారు ICAR-CIFT, కొచ్చికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డా. సారికా కె, NIFPHATT, కొచ్చీకి చెందిన ప్రాసెసింగ్ & క్వాటిలీ అస్యూరెన్స్ సూపర్‌వైజర్ డా. నితిన్ C.T., పరయల్ సీఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ మేనేజర్ శ్రీ ఫ్రాన్సిస్ అస్సిసీ, సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్, శ్రీ జయన్ జాకబ్, VKM ఫుడ్స్ జనరల్ మేనేజర్ శ్రీ విజయక్రిష్ణ సమక్షంలో చేసి చూపించారు.

ఈ ప్యానెల్ పోటీలో పాల్గొనేవారి సాంకేతిక నైపుణ్యాలు, వంటలలో శుభ్రత, రుచిలో ఖచ్చితత్వం అలాగే ప్రెజెంట్ చేసిన విధానం ఆధారంగా అంచనా వేయబడ్డారు.

అంతర్జాతీయ మార్కెట్ల మారుతున్న అంచనాలను అందుకోగల పటిష్టమైన మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల సముద్రపు ఆహార రంగాన్ని నిర్మించడంలో ఈ ఒలింపియాడ్ ఒక ముఖ్యమైన మైలురాయి అని శ్రీ జవహర్ అన్నారు.

“నాణ్యత హామీ, ఆహార భద్రత, ప్రాసెసింగ్ నైపుణ్యం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, సుస్థిరమైన సముద్రపు ఆహార ఉత్పత్తి మరియు నమ్మకమైన సరఫరా గొలుసులపై దృష్టి సారించడానికి MPEDA విశ్వసనీయమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఒలింపియాడ్ ద్వారా భారతదేశం తన ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది,” అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, అంతర్జాతీయ కొనుగోలుదారులు, పరిశ్రమల ప్రముఖులు, సాంకేతిక నిపుణులు మరియు 'సీఫుడ్ ఎక్స్‌పో భారత్ 2026'లో పాల్గొంటున్న ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫైనలిస్టులు తయారుచేసిన, అవార్డు గెలుచుకున్న విలువ జోడించిన సముద్రపు ఆహార ఉత్పత్తులను స్కిల్ ఒలింపియాడ్ పెవిలియన్‌లో ప్రదర్శించారు. వీటితో పాటు, MPEDA శిక్షణా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేసిన, ఎగుమతి ఆధారిత సముద్రపు ఆహార విలువ జోడించిన ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రదర్శనలు మరియు రుచి చూసే కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

MPEDA యొక్క 'స్కిల్ ఒలింపియాడ్' పెవిలియన్‌లో విలువ-ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తుల రుచి చూసే కార్యక్రమం కూడా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి సన్నాహకంగా, MPEDA భారతదేశ తూర్పు మరియు పశ్చిమ తీర ప్రాంతాలలో 50 సముద్రపు ఆహార విలువ జోడింపు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. వీటి ద్వారా, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ ఉన్న సముద్ర ఉత్పత్తులను తయారు చేయడానికి 2,500 మందికి పైగా సముద్రపు ఆహార ప్రాసెసింగ్ కార్మికులు మరియు నిపుణులకు శిక్షణ ఇవ్వబడింది.

ప్రాంతీయ రౌండ్లు ముంబై (పశ్చిమ తీర ప్రాంతం) మరియు విశాఖపట్నం (తూర్పు తీర ప్రాంతం)లో జరిగాయి. జూన్ 30న జరిగిన ఒలింపియాడ్ ప్రాంతీయ రౌండ్లలోని పోటీదారుల నుండి పది మంది ఫైనలిస్టులు ఎంపికయ్యారు.

Photo Gallery

+
Content
+
Content
+
Content