MPEDA చెన్నైలో సీ ఫుడ్ వాల్యూ ఎడిషన్ స్కిల్ ఒలింపియాడ్ గ్రాండ్ ఫినాలే జరపనుంది
ఫైనల్స్ జూలై 1న సీఫుడ్ ఎక్స్ పో భారత్ సందర్భంగా జరుగనుంది. ఇటువంటి ఒలింపియాడ్ ఇదే మొదటిది.
Chennai / June 29, 2025
చెన్నై, జూన్ 29: సముద్ర ఉత్పత్తులకు విలువ జోడింపులో నైపుణ్యాలను పెంపొందించడం, శిక్షణ పొందిన ప్రొఫెషనల్ పూల్‌ను నిర్మించడం మరియు నాణ్యతపై అవగాహన పెంచడం లక్ష్యంగా జూలై 1న జరిగే మొట్టమొదటి జాతీయ నైపుణ్య ఒలింపియాడ్‌లో భారతదేశంలోని సముద్ర రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణులు అత్యున్నత విజయాల కోసం పోటీ పడతారు.
మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (MPEDA) ప్రారంభించిన విశిష్ట ఒలింపియాడ్ యొక్క గ్రాండ్ ఫినాలే, నగరంలో జరిగే సీఫుడ్ ఎక్స్‌పో భారత్ 2025లో భాగంగా జరగనుంది.
ఈ కార్యక్రమానికి ప్రారంభ దశగా, శిక్షణ సమయంలో పొందిన నైపుణ్యాలను అంచనా వేయడానికి భారతదేశంలోని తూర్పు మరియు పశ్చిమ తీరాలలో శిక్షణ పొందిన నిపుణుల కోసం MPEDA అనేక రౌండ్‌లలో నైపుణ్య పరీక్షలను నిర్వహించింది. స్కిల్ ఒలింపియాడ్ మొదటి రౌండ్‌లు మే 29న కొచ్చిలో మరియు జూన్ 5న విశాఖపట్నంలో జరిగాయి.
జూన్ 30న చెన్నైలో జరగనున్న సెమీ-ఫైనల్‌కు పశ్చిమ అలాగే తూర్పు తీరాల ప్రతి దాని నుండి ఐదుగురు విజేతలు ఎంపికయ్యారు. సెమీ-ఫైనల్ నుండి అగ్రస్థానంలో నిలిచిన నలుగురు వ్యక్తులు సీఫుడ్ వాల్యూ అడిషన్‌పై స్కిల్ ఒలింపియాడ్ ఫైనల్‌లో పోటీ పడతారు.
చివరి రౌండ్ విజేతలకు నగదు బహుమతులు మరియు జ్ఞాపికలు అందజేయబడతాయి, మొదటి స్థానానికి రూ. 1,00,000, రెండవ స్థానానికి రూ. 75,000, మూడవ స్థానానికి రూ. 50,000, మరియు నాల్గవ స్థానానికి రూ. 25,000 కన్సోలేషన్ బహుమతిగా ఇవ్వబడతాయి.
ఈ స్కిల్ ఒలింపియాడ్‌ను కేంద్ర మరియు రాష్ట్ర మత్స్య శాఖల అధికారులు, సముద్ర ఆహార ఎగుమతిదారులు, విదేశీ కొనుగోలుదారులు మరియు సీఫుడ్ ఎక్స్‌పో భారత్ 2025 ఇతర ప్రతినిధులు సహా వాటాదారులు వీక్షిస్తారు. SEB 2025లో 116 కంటే ఎక్కువ స్టాల్‌లు పెట్టగలిగే ఎగ్జిబిషన్ ఏరియా ఉంటుంది, 3,000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఇది ఎగ్జిబిటర్‌లు మరియు సందర్శకులు అర్థవంతమైన వ్యాపార చర్చలలో పాల్గొనడానికి, సాంకేతిక ఆవిష్కరణల గురించి ఒకరితో ఒకరు పంచుకోవడానికి చేసుకోవడానికి అలాగే తాజా పరిశ్రమ పరిణామాలను ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడానికి ఒక శక్తివంతమైన వేదికను అందిస్తుంది.
స్కిల్ ఒలింపియాడ్ ఛాంపియన్లు తయారుచేసిన ఉత్పత్తులను ప్రేక్షకుల కోసం ప్రదర్శిస్తారు. అంతేకాకుండా, MPEDA స్కిల్ ఒలింపియాడ్ పెవిలియన్‌లో విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులను రుచి చూసే సెషన్ కూడా జరుగుతుంది.
భారతదేశ సముద్ర ఆహార విలువ జోడింపు రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు దేశాన్ని విలువ ఆధారిత సముద్ర ఆహార ఎగుమతులకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి ఏటా ఒలింపియాడ్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు ఉన్నాయని MPEDA చైర్మన్ శ్రీ డి.వి. స్వామి అన్నారు.
"కేంద్రం ప్రారంభించిన వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా జరిగే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం, పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను ప్రోత్సహించడం, శిక్షణ పొందిన సముద్ర ఆహార కార్మికులను గుర్తించడం మరియు సముద్ర ఆహార రంగంలో ఉపాధిని పెంచడం ద్వారా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది" అని ఆయన వివరించారు.
జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు నిర్వహించిన ఆచరణాత్మక శిక్షణా కార్యక్రమాల ద్వారా MPEDA 2,500 మందికి పైగా కార్మికులకు సముద్ర ఆహార విలువ జోడింపులో శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం భారతదేశం అంతటా విలువ జోడింపు రంగంలో దాదాపు 4,000 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడంలో సీఫుడ్ ప్రాసెసింగ్ నిపుణులకు శిక్షణ ఇవ్వబడింది. వీటిలో వివిధ రకాల రొయ్యలు, సెఫలోపాడ్‌లు మరియు నోబాషి (సాగదీసిన రొయ్యలు), బ్రెడ్ నోబాషి రొయ్యలు, బ్రెడ్ బటర్‌ఫ్లై రొయ్యలు, వండిన PDTO రొయ్యలు, బటర్‌ఫ్లై సుషీ రొయ్యలు, మ్యారినేట్ చేసిన రొయ్యల స్కేవర్లు, బ్రెడ్ ఫిష్ ఫిల్లెట్‌లు, ఫిష్ ఫింగర్లు, స్క్విడ్ కట్ రింగ్‌లు, బ్రెడ్ స్క్విడ్ రింగ్‌లు మరియు మిశ్రమ సీఫుడ్ స్కేవర్‌లు వంటి చేపల ఉత్పత్తులు ఉన్నాయి.
2024–25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7.44 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసింది. ప్రస్తుతం, భారతదేశంలో 35,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన 650 ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిలో 100 కంటే ఎక్కువ యూనిట్లు హై-ఎండ్ విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో పాల్గొంటున్నాయి, ఇది మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 10 శాతం (USD 0.74 బిలియన్)కు దోహదం చేస్తుంది.
2030 నాటికి భారతదేశం తన మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో విలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేసి 20 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ముగింపు