శబరిమల మైక్రోసైట్, ఇ-బ్రోచర్‌‌ను ప్రారంభించిన పర్యాటక మంత్రి శ్రీ మహమ్మద్ రియాస్

యాత్రికుల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని ప్రాజెక్టులు: మహమ్మద్ రియాస్
Trivandrum / December 12, 2024

తిరువనంతపురం, డిసెంబర్ 12:  కేరళ టూరిజం శాఖ, బహుభాషలో మైక్రోసైట్ (https://www.keralatourism.org/sabarimala/)ను, శబరిమల గురించిన సమగ్ర సమాచారాన్ని అందించే ఇ-బ్రోచర్‌ను ప్రారంభించింది.

కేరళ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, టూరిజం మంత్రిగా పనిచేస్తున్న PA మహమ్మద్ రియాస్, బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రెండు చొరవలను ప్రారంభించారు.

ఈ బహుభాషా మైక్రోసైట్, దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులకు శబరిమల పుణ్యక్షేత్రం గురించిన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి సంబంధిత సమాచారాన్ని, అలాగే తాజా నవీకరణలు, భౌగోళిక పరమైన విషయాలను అందజేస్తుంది.

ఈ సైట్ ఐదు ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది: అవి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషలు. దక్షిణ భారతదేశంలో కెల్ల ప్రసిద్ధి చెందిన ఈ తీర్థయాత్రకు సంబంధించిన అన్ని వివరాలను అందించే చిన్న ఫుటేజ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా యాత్రికుల సందర్శన ప్రాధాన్యతను సంతరించుకొంటున్న ఇలాంటి శుభ సమయంలో, మన వారసత్వం, చారిత్రక దేవాలయాలను పర్యాటక రంగంలో భాగంగా చేర్చడానికి ఈ మైక్రోసైట్, ఇ-బ్రోచర్ ఆవిష్కరణ అత్యంత కీలక చర్యలని మంత్రి పేర్కొన్నారు.

ఈ మైక్రోసైట్, శబరిమలను సందర్శించే యాత్రికులకు అన్ని విధాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడమే కాకుండా, వారికి సౌకర్యవంతమైన, అవాంతరాలులేని యాత్ర అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుందని, అంతేకాకుండా రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని వరుస ప్రాజెక్టులు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ మైక్రోసైట్‌లో శబరిమలకు సమీపంలో ఉన్న ఇతర ముఖ్యమైన దేవాలయాల వివరాలు, సరైన రూట్ మ్యాప్, ఆలయాలకు సమీపంలో ఉన్న వసతి సౌకర్యాల వివరాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు, యాత్రికులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సైట్‌లో శబరిమలకు సంబంధించిన వందలాది ఫొటోలతో ప్రత్యేక గ్యాలరీ కూడా ఉంది.

"దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులు శబరిమల గురించి వివరంగా తెలుసుకోవడానికి, సురక్షితంగా, సుభద్రంగా వారి పర్యటను ప్లాన్ చేసుకోవడానికి ఈ మైక్రోసైట్, ఇ-బ్రోచర్ విలువైన, విశ్వసనీయమైన వనరులుగా ఉంటాయి" అని టూరిజం డైరెక్టర్ శ్రీమతి శిఖా సురేంద్రన్ తన అభిప్రాయం తెలిపారు.

పూర్తి వివరాలను కలిగి ఉన్న ఈ ఇ-బ్రోచర్ ఒక వర్చువల్ ట్రావెల్ గైడ్ లాంటిది, ఇది మీ యాత్రను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడ బస చేసే ప్రదేశాల వివరాలు, అధికారుల సంప్రదింపు నంబర్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.

ఈ బ్రోచర్‌లో శబరిమల పుణ్యక్షేత్రం గురించిన ఆచారాలు, సంప్రదాయాలు, ఆలయ చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని అందించే వివరణాత్మక గైడ్  కూడా ఉంది.

ఈ ఫార్మాట్ పర్యాటకులకు స్మార్ట్ ఫోన్‌లలో ఇ-బ్రోచర్‌ను యాక్సెస్ చేయడానికి, అలాగే ఇతరులతో దాన్ని షేర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ కార్యక్రమానికి గౌరవనీయులు, టూరిజం మిషన్ సొసైటీ CEO శ్రీ K. రూపేష్ కుమార్ కూడా హాజరయ్యారు.

ముగింపు.

Photo Gallery

+
Content
+
Content